వెల్దుర్తి ఆగష్టు ౩౦ రాజధాని వాయిస్:
టీడీపీ కార్యకర్తల ప్రతీ కష్టంలోనూ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెంది, టీడీపీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా నగదు చెక్కులను ఆదివారం స్ధానిక క్యాంపు కార్యాలయంలో అందజేశారు. రెంటచింతల మండల కేంద్రానికి చెందిన పోలిశెట్టి వెంకటేశ్వర్లు, దుర్గి మండలం అడిగొప్పల గ్రామానికి చెందిన ఆరికట్ల వెంకట్రామయ్య లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా సభ్యత్వ నమోదు ప్రమాద బీమా ఇరు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్ష చొప్పున నగదు చెక్కులను ఆయన అందజేశారు. కష్టకాలంలో మాకు అండగా నిలుస్తున్న పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, జూలకంటి లకు ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుమంత్ రెడ్డి, యాగంటి నరేష్, రామకృష్ణ, వడ్లవెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments