దుర్గి. ఆగస్టు 29
మండల కేంద్రంలోని పి.ఎం.శ్రీ ఎ.పి. మోడల్ స్కూల్‌లో క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రెహమాన్ మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర వికాసానికి చదువుతో పాటు క్రీడలు, మాతృభాషా జ్ఞానం ఎంతో అవసరమని తెలిపారు. క్రీడలు విద్యార్థులలో క్రమశిక్షణ, గెలుపోటములను సమానంగా స్వీకరించే మనోధైర్యాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని చెప్పారు. అలాగే మాతృభాష అయిన తెలుగు వైభవాన్ని, సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు వివిధ ఆటల పోటీలతో పాటు తెలుగు భాషా ప్రాముఖ్యతపై వ్యాసరచన, వక్తృత్వ, కవితల పోటీలు నిర్వహించారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రిన్సిపాల్, ఎస్‌ఎంసీ చైర్మన్, ఉపాధ్యాయుల చేతుల మీదుగా జ్ఞాపికలు, పతకాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రెహమాన్, ఎస్‌ఎంసీ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments