Monday, 31 August 2026
Telugu Daily
Header
BREAKING

సమగ్ర గ్రామాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం..!

- ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి



వెల్దుర్తి ఆగస్టు 31 రాజధాని వాయిస్ :

సమగ్ర గ్రామాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. సోమవారం మండల పరిధిలోని చిన పర్లపాయ తండా నందు రూ.32 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా అధికారులు సేవలు అందించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పల్లెలన్నీ గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు పడుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కళ్లం రామాంజిరెడ్డి, కుర్రి శివారెడ్డి, నర్రా గుర్వారెడ్డి, సంజీవరెడ్డి, ముప్పళ్ళ శ్రీనివాసరావు, కొర్ర రవింద్రనాయక్ , వడితె కొండా నాయక్, కొర్ర బాలు నాయక్, వడితె ధనుంజయ నాయక్, కొర్ర మంగ్యా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!