నరసరావుపేట. ఆగస్టు 31
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశానుసారం ఇంటెన్సిఫైడ్ ఐ ఈ సి కాంపెయిన్ -2026 లొ భాగంగా జిల్లా లో హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కొరకు ఎల్ ఇ డి వాహనం ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఎల్ ఇ డి వాహనం జిల్లా లో 15 రోజుల పాటు వివిధ గ్రామాల్లో బాగా రద్దీ గా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు హెచ్ఐవి పై అవగాహన కొరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఈ హెచ్ఐవి పై అవగాహన కలిగి ఉండాలని, జిల్లా లో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్ఐవి నిర్ధారణ పరీక్ష ఉచితంగా చేస్తారని,హెచ్ఐవి ఉన్నవారు క్రమంతప్పకుండా ప్రభుత్వం వారు అందించే ఏ ఆర్ టి మందులు వాడాలని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రత్న మన్మోహన్, జిల్లా లె ప్ర సి ఎయిడ్స్ మరియు టిబి అధికారి డాక్టర్ మాధవి లత, దిశ సి పి యం జనీభాష, క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ కిరణ్ హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ పి డి ఆనంద్ బెంజిమెన్, జిల్లా లో ఐ సి టి సి, ఏ ఆర్ టిమరియు డి ఎస్ ఏర్ సి సిబ్బంది, జిల్లా లోని టిఐ NGOs ,lws CSC's సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0 Comments