Monday, 31 August 2026
Telugu Daily
Header
BREAKING

అప్పికట్ల వారింటి ఆణిముత్యం

గుంటూరు.ఆగస్టు 31 

బీదరికపు అగచాట్లను సహనమున భరియించి
బరువు బాధ్యతలలో తల్లికి అండగా నిలిచి
అణచివేయు జనుల అహమును ఖండించి
నిచ్చెన మెట్ల కట్టుబాటును నిరసించెనే.
భరతమాత దాస్య శృంఖలములను బాప
మహాత్ముని అహింసామార్గమును ఆచరించి
క్విట్టు ఇండియా లో కీలక పాత్ర వహించెనే.
మార్తమ్మను పరిణయ మాడి
సప్త స్వరముల వంటి సంతానమును పొందెనే.
శాసనసభ సభ్యునిగా ప్రజా సేవలో ప్రవేశించి
బెజవాడ రైలు జంక్షన్ ఏర్పాటుకు కృషి సల్పి
చర్మకారులకు చేయుత నిచ్చి
అన్నదాతకు అండగా నిలచి
పాల ప్రాజెక్టులు ప్రారంభించెనే.
జనుల గోడును ప్రత్యక్షముగా ఆలకించి
గిరిపుత్రులకు గురుకులాలు ఏర్పరచి
బడుగు జీవుల బతుకుల్లో
వెలుగు దివిటి విద్య ఒక్కటేనని తలచి
వసతి గృహ నిర్మాణమునకు శ్రీకారం చుట్టెనే.
వర్ణాంతర వివాహములను ప్రోత్సహించి
ఆపదలలో ఆలుమగలుకు అండగా నిలిచి
అధికార దర్పంతో ఆస్తులు కూడగట్టక
నిరాడంబరునిగా నిత్యము మసలి
సమాజ హితవు సంతానమునకు నేర్పి
అప్పికట్ల వారింటి ఆణిముత్యమై వెలిగి
ఆదర్శ నాయకునిగా ఎదిగినే జోసెఫ్‌.

తొలితరం కాంగ్రెస్ నాయకులు, ఆంధ్ర రత్నం మాన్యశ్రీ అప్పికట్ల జోసఫ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి అక్షరాంజలి ఘటిస్తూ.....

*అనిల్ కుమార్ దారివేముల*
*మాచర్ల, పల్నాడు జిల్లా.*
*9951244718*

📰
Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!