మాచర్ల: ఆగస్టు 30 రాజధాని వాయిస్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కజ్జం సైదయ్య జన్మదినం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆదివారం పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వేడుకలను ఆడంబరాలకు పోకుండా సేవా స్ఫూర్తితో జరుపుకోవడం విశేషం.
ఇందులో భాగంగా దుర్గి మండలం ఆత్మకూరు అడ్డరోడ్డు వద్ద ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసి, స్వయంగా భోజనాలు వడ్డించారు. అనంతరం మాచర్ల పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులను పరామర్శించి వారికి బ్రెడ్, ఆపిల్స్, అరటిపండ్లను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, పేదల పట్ల మానవత్వాన్ని చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు నాయకులు తెలిపారు. సైదయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లి ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పిన్నంశెట్టి కృష్ణ, నాయకులు భక్తుల అనిల్, బోనాల చెన్న, సాయి, రాయుడు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments