Monday, 31 August 2026
Telugu Daily
Header
BREAKING

బాపట్ల జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ కు 152 సమస్యల అర్జీలు...

పి జి ఆర్ ఎస్ లో అర్జీదారులు అందజేసిన సమస్యలు అర్జీదారుల కు పరిష్కరం చూపాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

బాపట్ల,ఆగస్టు 31 


 పి ఆర్ ఎస్ లో అర్జీదారులు అందజేసిన సమస్యలు అర్జీదారుల కు పరిష్కరం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ హల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిస్కార వేదిక(పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి డి యం & హెచ్ ఓ,డాక్టర్ ఎస్.విజయమ్మ,డి ఎఫ్ ఓ. పి.సౌజన్య, ఇంచార్జి డి ఆర్ ఓ మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, లతో కలసి అర్జీల ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పి జి ఆర్ ఎస్ లో అర్జీదారులు అందజేసిన సమస్యలు అర్జీదారుల కు పరిష్కరం చూపాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు.పి ఆర్ ఎస్ లో ప్రజల అందజేసే సమస్యల కు సంబంధించి అర్జీదారులతో సంబంధిత అధికారులు మాట్లాడి వారి సమస్యలను పరిష్కరం చేయాలన్నారు. ఈరోజు నిర్వహించిన పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 152 మంది అర్జీదారు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు రావడం జరిగిందని తెలిపారు.అర్జీదారుల తో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అర్జీలు పునరావృతం గాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారికి పరిష్కారం చూపాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎలక్షన్స్,e - ఆఫీస్,పి యం సూర్య గర్,రెడ్ క్రాస్,సైనిక సంక్షేమ వంటి అంశాలపై జిల్లా అధికారుల తో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.గత వారంలో పి జి ఆర్ ఎస్ అర్జీల పరిష్కారంలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన భట్టిప్రోలు మండల తహశీల్దార్ నాగరాజు ను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఇంచార్జి డి ఆర్ ఓ ఘనంగా సత్కరించి, శాలువలు కప్పి, జ్ఞాపికను అందజేసి అభినందించారు. వచ్చిన ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించిన తదుపరి నాణ్యతతో పరిష్కరిస్తున్నామని తహశీల్దార్ కలెక్టర్ కు తెలియజేసారు. పరిష్కార మార్గంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం ద్వారా అవార్డు దక్కిందన్నారు. అధికారులు, సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమైందని తహశీల్దార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డి యం & హెచ్ ఓ.డాక్టర్ ఎస్.విజయమ్మ, డి పి ఓ.యల్.ప్రభాకర్ రావు, సి పి ఓ.ఏ.ఎస్.రాజు, పి డి లు, డిఆర్డీఏ, డ్వామా, మెప్మా, గృహ నిర్మాణ సంస్థ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బి.సింగయ్య, విజయలక్ష్మి, ఆనంద్ సత్య పాల్, వెంకటేశ్వర రావు,రాధమాదవి,డి ఈ ఓ.శ్రీనివాస్, మార్క్ పేడ్ డి యం.కరుణశ్రీ, డి సి హెచ్ ఎస్.పద్మావతి, డి టి సి. పరందామ రెడ్డి, ఆర్ టి సి ఆర్ యం.విమల, జి యం.డి ఐ సి.రామకృష్ణ, జిల్లా ఖజానా అధికారిణి పద్మావతి,జిల్లా పౌర సరఫరాల శాఖ డి ఎస్ ఓ.జగన్మోహన్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్ ,బి.సి. శాఖల అధికారులు శివలీల,జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారిణి మాధవి, మత్స్య శాఖ ఏ డి గాలిదేవుడు,ఏ పి ఎస్ పి డి సి యల్,ఆంజనేయులు, భూ రికార్డ్స్ ఏ డి,సాంబశివరావు, జిల్లా ట్రెజరీ అధికారిణి పద్మావతి,సర్వ శిక్ష అభియాన్ పి ఓ.శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!