చిలకలూరిపేట ఘోర రోడ్డు ప్రమాదం
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందించిన ప్రభుత్వం
చిలకలూరిపేట. ఆగస్టు 31
పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన 8 మంది కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.ఈ నెల 27న విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, చిలకలూరిపేట వద్ద ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన 8 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మృతుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వేలూరు గ్రామంలో మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల విలువైన పరిహారం చెక్కులను స్థానిక ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కలిసి అందజేశారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రజాప్రతినిధులు, అధికారులు భరోసా ఇచ్చారు.
0 Comments