Tuesday, 20 October 2026
Header1
BREAKING

ఎన్టీఆర్ స్పూర్తితో రైతులకు సంక్షేమాలు..!

- ఆస్తుల హరించేందుకు జగన్ కుట్రలు, - కూటమి ప్రభుత్వ సంస్కరణలతో రైతేరాజు..!, - ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 దుర్గి
📅 ప్రచురణ: 10 Sep 2026, 06:05 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 107 views

దుర్గి: సెప్టెంబర్ 10 రాజధాని వాయిస్:

టీడీపీ వ్యవస్ధాపకులు అన్న ఎన్టీఆర్ స్పూర్తితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు సంక్షేమాలను అందిస్తున్నారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం మండల పరిధిలో పర్యటించిన ఆయన.., ముందుగా మైనింగ్ గ్రాంట్ నిధులు ద్వారా రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన క్రీస్తు లూధరన్ చర్చి కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు అనంతరం గ్రామంలో పర్యటించి, స్ధానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మండల రెవిన్యూ అధికారులు ఏర్పాటు చేసిన మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని, 857 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టదారు పాసుపుస్తకాలను అందించారు.

WhatsApp Image 2026-09-10 at 5.27.14 PM.jpeg

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రైతుల ఆస్తులను హరించేందుకు జగన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. పట్టదారు పాసుపుస్తకాలపై, పొలం గట్ల రాళ్లపై జగన్ ఫోటో ముద్రించుకుని రాష్ట్రంలోని రైతుల ఆస్తులను తాకట్టుపెట్టాలని చూశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ రీసర్వే ద్వారా రైతుల ఆస్తులను పరిరక్షించేలా పాసుపుస్తకాలపై రాజముద్రను ముద్రించి పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు. అలానే జగన్ రెడ్డి ఎత్తివేసిన 33 రైతు సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్దరించి, రైతును రాజును చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యకక్రమంలో తహశీల్దార్ వరకుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, కూటమి పార్టీల నాయకులు యాగంటి మల్లికార్జునరావు, లింగా బ్రహ్మయ్య, జానికిరామయ్య, శంకర్, రమేష్, నాగేశ్వరరావు, పులిహరి తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X