Tuesday, 20 October 2026
Header1
BREAKING

దేవరంపాడు తెట్టెల చెరువు చేపల బహిరంగ పాట

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 19 Oct 2026, 12:59 PM
🔄 నవీకరణ: 20 Oct 2026, 06:50 AM
👁️ 194 views

*దేవరంపాడు తెట్టెల చెరువు చేపల బహిరంగ వేలంపాట నిర్వహణ.

*రాజుపాలెం:*

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం,రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామంలోని తెట్టెల చెరువు చేపల వేలం పాట 2026-27 సంవత్సరానికి గాను గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ S శ్యామ్ ప్రసాద్ గారి ఆద్వర్యంలో వేలం పాట నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమములో Dy ఎంపీడీఓ ముక్కంటిగారు, దేవరంపాడు పంచాయతీ సెక్రటరీ Shaik మొక్తాయర్ మరియు కోట నెమలిపూరి కార్యదర్శి శ్యామ్ గారు హాజరయ్యారు. చెరువు వేలం పాట సరిఅయిన మద్దతు ధర రానికారణముగా మూడు సార్లు వాయిదా పడటం జరిగింది.ఎట్టకేలకు 19-10-2026 న దేవరంపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాట నిర్వహించారు.చేపల చెరువు వేలం పాటలో రాం.రంగారావు,జొన్నల గడ్డ శ్రీనివాస రావు ఒక్కొక్కరూ 50 వేలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొన్నారు.ఈ ఏడాది ఎల్ నినో వల్ల చెరువులో నీళ్ళు లేని కారణంగా జూన్ లో పెట్టాల్సిన వేలం పాట ఆలస్యంగా అక్టోబర్ లో పెట్టడం జరిగింది.8 నెలల కాలానికి 8 లక్షల 3 వేలకు రాం. రంగారావు వేలం పాట పాడడం జరిగింది.30 జూన్ 2027 న వేలం పాట గడువు పూర్తి అగును.ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి అధ్యక్షుడు పత్తిపాటి వెంకయ్య,నేతి వెంకన్న స్వామి దేవాలయ చైర్మన్ తెలగనేని వెంకటేశ్వర్లు,గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు రుసుం వెంకటేశ్వర్లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X