Tuesday, 20 October 2026
Header1
BREAKING

కానిస్టేబుళ్లే పోలీసు వ్యవస్థకు వెన్నెముక

- క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వంతో విధులు నిర్వర్తించాలి: హోంమంత్రి అనిత

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 అమరావతి
📅 ప్రచురణ: 22 Sep 2026, 12:40 PM
🔄 నవీకరణ: 12 Oct 2026, 03:38 PM
👁️ 946 views

అమరావతి, సెప్టెంబర్ 22: రాజధాని వాయిస్ :

పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుని ప్రజలకు సేవ చేయాలని నూతనంగా విధుల్లోకి అడుగుపెడుతున్న కానిస్టేబుళ్లకు సూచించారు. పోలీసు యూనిఫాం ప్రజల్లో భయాన్ని కాకుండా భరోసాను కల్పించేలా ఉండాలని అన్నారు.

WhatsApp Image 2026-09-22 at 12.04.18 PM.jpeg

మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌ బీటీసీ పరేడ్‌ గ్రౌండ్స్‌లో మంగళవారం 2025–26 బ్యాచ్‌కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు అవార్డులను అందజేశారు.
WhatsApp Image 2026-09-22 at 12.04.18 PM (1).jpeg

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో రాష్ట్రంలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను ఎన్నో అడ్డంకులను అధిగమించి పూర్తి చేశామని తెలిపారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 21 శిక్షణ కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తయిందని తెలిపారు. వీరిలో 2,330 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఉన్నారని వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో సుమారు 1,000 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండటం విశేషమన్నారు.
WhatsApp Image 2026-09-22 at 12.04.19 PM.jpeg

ప్రజలకు పోలీసులంటే భరోసా కలగాలి

పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. విపత్తులు, బందోబస్తు, అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, సైబర్‌ నేరాల నియంత్రణకు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ అందించామని తెలిపారు.
WhatsApp Image 2026-09-22 at 12.04.21 PM (1).jpeg

పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా విని, వారికి సత్వర న్యాయం అందించేలా పనిచేయాలని సూచించారు. పోలీసులంటే ప్రజల్లో భయం కాకుండా భరోసా కలిగేలా వ్యవహరించాలన్నారు.

రాజ్యాంగానికి అనుగుణంగా విధులు

WhatsApp Image 2026-09-22 at 12.04.20 PM (1).jpeg

రాజ్యాంగానికి అనుగుణంగా రాగద్వేషాలకు అతీతంగా నీతి, నిజాయితీ, కర్తవ్య స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని హోంమంత్రి అనిత దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన 2047 విజన్‌లో కానిస్టేబుళ్లు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పదవీ విరమణ వరకు క్రమశిక్షణతో, ప్రశాంతంగా ప్రజలకు సేవలందిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని నూతన కానిస్టేబుళ్లకు హోంమంత్రి అనిత సూచించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X