Tuesday, 20 October 2026
Header1
BREAKING

శ్రీకాళహస్తి మునిసిపాలిటీ సీటు కోట చంద్రశేఖర్ కు అవకాశం కల్పించాలి

నాయీ బ్రాహ్మణులకు ఒక్క అవకాశం ఇవ్వండి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 13 Oct 2026, 06:30 PM
🔄 నవీకరణ: 16 Oct 2026, 06:42 PM
👁️ 7 views

*కోట చంద్రశేఖర్‌కు అవకాశం ఇవ్వాలి*

*నాయి బ్రాహ్మణుల ఐక్యతతో బీసీ చైర్మన్‌ పదవికి అండగా నిలుద్దాం*

*శ్రీకాళహస్తి*
శ్రీకాళహస్తి మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని ఇప్పటికే బీసీ వర్గానికి కేటాయించిన నేపథ్యంలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలని ఆ వర్గీయులు కోరుతున్నారు. నాయి బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంట్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌గా సామాజికవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం పనిచేస్తున్న కోట చంద్రశేఖర్‌కు చైర్మన్‌ పదవిలో అవకాశం కల్పించాలని వారు అభిప్రాయపడుతున్నారు.
కోట చంద్రశేఖర్‌ ఆర్థికంగా బలమైన పరిస్థితిలో లేకపోయినా, తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని నాయి బ్రాహ్మణులంతా ఐక్యంగా నిలిస్తే ఆర్థిక పరమైన లోటును అధిగమించవచ్చని సామాజికవర్గ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఆయనకు అవకాశం లభిస్తే ఎన్నికల ప్రచారంతో పాటు అవసరమైన ఆర్థిక సహకారం కూడా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.
*ఒక్కటై అండగా నిలుద్దాం*
శ్రీకాళహస్తి మున్సిపల్‌ చైర్మన్‌ పదవిలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కేలా కోటా చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. ఇది ఒక్క వ్యక్తికి దక్కే పదవిగా కాకుండా నాయి బ్రాహ్మణ సామాజికవర్గానికి లభించే రాజకీయ ప్రాతినిధ్యంగా చూడాలని పేర్కొంటున్నారు.
తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని నాయి బ్రాహ్మణులంతా పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఐక్యంగా నిలిచి కోట చంద్రశేఖర్‌కు అండగా నిలవాలని పిలుపునిస్తున్నారు. అవకాశం లభిస్తే కోట చంద్రశేఖర్‌ను గెలిపించుకునేందుకు సమష్టిగా కృషి చేస్తామని నాయి బ్రాహ్మణ వర్గీయులు భరోసా వ్యక్తం చేస్తున్నారు.
బీసీ వర్గానికి కేటాయించిన చైర్మన్‌ పదవిలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి అవకాశం కల్పించడం ద్వారా బీసీ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యానికి మరింత బలం చేకూరుతుందని వారు పేర్కొంటున్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X