మాచర్ల: సెప్టెంబర్ 19 రాజధాని వాయిస్ :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే ‘ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా, ఈ నెల 21వ తేదీ సోమవారం నాడు మాచర్ల పట్టణంలోని వివిఎన్ గార్డెన్స్‌లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పర్యటించనున్నారు. ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ప్రజల నుంచి ఆమె నేరుగా సమస్యలు, అర్జీలను స్వీకరిస్తారని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా నరసరావుపేట కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేస్తూ, మాచర్లలో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా, మండల స్థాయిల అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.
Be the first to share your thoughts on this story!