గురజాల నియోజకవర్గంలో చతికిలపడ్డ వైసిపి
రాజధాని వాయిస్:
పిడుగురాళ్లలో వైసీపీ చైర్మన్ అభ్యర్థికి నిరాశ ఎదురైంది. చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన షేక్ అబ్దుల్లా నిర్ణీత సమయానికి 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడంతో ఎన్నికల అధికారి ఆయన నామినేషన్ స్వీకరించేందుకు నిరాకరించారు.నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అయితే నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాత నామినేషన్ స్వీకరించడం సాధ్యం కాదని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. దీంతో చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న షేక్ అబ్దుల్లా నామినేషన్ దాఖలు చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
మరోవైపు పిడుగురాళ్లలో వైసీపీ తరఫున పోటీ చేయాలనుకున్న కౌన్సిలర్ అభ్యర్థులు సైతం నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు. చైర్మన్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం, కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేయకపోవడంతో వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. ఇదిలా ఉండగా దాచేపల్లిలో మాత్రం హైకోర్టు అనుమతితో అభ్యర్థి రవి నామినేషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం నుంచి అనుమతి పొందిన అనంతరం ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
గురజాలలోనూ..
అటు గురజాలలోనూ వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకపోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. పిడుగురాళ్లలో నామినేషన్ గడువు ముగిసిన కారణంగా వైసీపీ చైర్మన్ అభ్యర్థి వెనుదిరగాల్సి రాగా దాచేపల్లిలో హైకోర్టు అనుమతితో నామినేషన్ దాఖలు కావడం, గురజాలలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకపోవడం ఆయా ప్రాంతాల్లో రాజకీయ పరిణామాలకు దర్పణంగా నిలిచాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైకాపా,స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికలలో అయిన సత్తా చాటుతుందని భావించిన వైసిపి కేడర్లో అసలు నామినేషన్లు వేయకపోవడం నిరాసక్తత నెలకొని వుంది.ఇప్పడుడే ఇలా ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో వైకాపా పరిస్థితి ఎలా ఉంటుందోనని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత ఎన్నికలలో అధికారంలో ఉన్నప్పుడు వైసిపి బలంగా ఉందని నిరూపించినప్పుడు, నేడు ప్రతిపక్షంలో ఘోరంగా ఎందుకు విఫలమైందని, అసలు నామినేషన్లు వేయడానికి గురజాల,దాచేపల్లి,పిడుగురాళ్ల లో అభ్యర్థులు ముందుకు రాకపోవడానికి కారణం ఏమిటిని ఒక చర్చ నియోజకవర్గ ప్రజలలో నడుస్తుంది.
Be the first to share your thoughts on this story!