మాచర్ల అక్టోబర్ 19 రాజధాని వాయిస్ :
మాచర్ల పట్టణంలోని కాసు బ్రహ్మానంద రెడ్డి కళాశాల క్రీడా మైదానంలో, గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న మండవ మాచర్ల ప్రీమియం లీగ్,ద్వారా వెనకబడిన పలనాడు ప్రాంతంలో క్రీడాకారుల వారిలో ఉన్న క్రీడా నైపుణ్యం న్ని వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేయాలని ఆశయం తపన మండవి రవి కి,మెండుగా ఉన్నాయి.ఇక వివరాల్లోకి వెళితే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల కు కారంపూడి సూపర్ కింగ్స్ రెంటచింతల రాయల్స్ మధ్య జరిగిన హోరాహోరీ పోటీలను మాచర్ల నియోజకవర్గం 30 వేల పైచిలుకు ప్రజలు మ్యాచ్ ఆసక్తిగా తిలకించారు. ఈ హోరాహోరీ పోటీలలో ఇరు జట్లు రంగంలోకి దిగి నువ్వా నేనా అంటూ పలనాటి బ్రహ్మనాయుడు మరియు నాగమ్మ చరిత్రను మరొకసారి ఎం పి ఎల్ ద్వారా గుర్తు చేస్తూ... కారంపూడి సూపర్ కింగ్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఆడి మొదట ఇన్నింగ్స్ లో 20 ఓవర్లకు 137 స్కోర్ ను చేసి ప్రత్యర్థి ప్రత్యర్థి జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యాన్ని ముందుంచింది. అనంతరం బరిలోనికి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఈ భారీ లక్ష్యాన్ని తమ టీముతో 19 ఓవర్లోనే లక్ష్యాన్ని చేదీంచి విజయ డంకా మోగించింది.అనంతరం మ్యాచ్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మాట్లాడుతూ మండల మాచర్ల ప్రీమియం లీగ్ ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చిన మండవ రవి కి మొదటగా కృతజ్ఞతలు తెలుపుతూ ఐపీఎల్ తరహాలో ఈ మ్యాచ్ జరగటం ప్రస్తుతం ఎలక్షన్స్ నామినేషన్లు ప్రక్రియ జరుగుతున్నప్పటికీ దానిని సైతం పక్కన పెట్టి మాచర్ల ప్రజలు ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ లాగా తిలకించటం మాకు చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు. తరువాత మండలవ రవి,మాట్లాడుతూ ఎంపిల్ అనే ఉద్దేశం. పలనాడులోని క్రీడాకారులను వెలికి తీసి ఇంటర్నేషనల్ మ్యాచ్లకు ఐపిఎల్ లకు పంపించి మన మాచర్ల ప్రాంతాన్ని పరిచయం చేయటం అలాగే వెనుకబడిన క్రీడాకారులు కూడా ప్రోత్సహించి నా వంతుగా కృషి చేస్తానని వారు తెలిపారు. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన రెంటచింతల రాయల్స్ చెందిన సుధీర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జూలకంటి గౌతంరెడ్డి,విశిష్ట అతిథిగా రంజీ ప్లేయర్ జూలకంటి రాజారెడ్డి, మరియు జూలకంటి అక్కిరెడ్డి, యనమల కేశవరెడ్డ, దారు నాయక్,యాగంటి మల్లికార్జున,తదితరులు విచ్చేశారు..
Be the first to share your thoughts on this story!