Tuesday, 20 October 2026
Header1
BREAKING

పట్టణాలు ధీటుగా గ్రామాలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ఆగిరిపల్లి మండలంలో రూ 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 12 Oct 2026, 11:31 PM
👁️ 22 views

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి 

ఏలూరు/ఆగిరిపల్లి

ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామంలో సోమవారం సాయంత్రం రూ 80 లక్షలు వ్యయంతో చేపట్టనున్న కమ్యూనిటీ హాలు, రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులకు, ఆగిరిపల్లి గ్రామంలో రూ 20 లక్షలు వ్యయంతో నిర్మించనున్న ముదిరాజుల కమ్యూనిటీ హాలుకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి భూమి పూజలు, శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు.

1004275256.jpg
Type image caption here...


 గ్రామస్థులు పూలజల్లుతో, బాణా సంచాలు పేల్చి ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులను ఇచ్చి మంత్రి నుదుటిన మహిళలు కుంకుమ తిలకం దిద్దారు. గ్రామాల్లో మిగిలిన అభివృద్ధికార్యక్రమాలు దశలు వారీగా చేస్తానని, అర్హులు అందరికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేస్తామని మంత్రి హామీఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, పట్టణాలు ధీటుగా గ్రామాలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. గ్రామాల్లో మౌళిక సదుపాయాలు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామాల్లో మిగిలి ఉన్న పనులు దశలు వారీగా పూర్తి చేస్తామని తెలిపారు. వర్షాకాలంలో నీటి నిల్వలు, పారుదల సమస్యలను అధిగమించేందుకు డ్రైనేజీ, కల్వర్టులు నిర్మాణం ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలు అభివృద్ధి, ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రజలకు శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకు నేందుకు కమ్యూనిటీ హాలు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకురావాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కూటమి నాయకులు, గంగిరెద్దులు సంఘ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X