నరసరావుపేట:
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయుధ పూజ, శ్రీ కనకదుర్గ అమ్మవారి పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎస్పీ జగదీష్ అదహళ్లి దంపతులు పూజల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందనే సత్యాన్ని దసరా పండుగ చాటిచెబుతుందని, దుష్టశక్తులపై దైవశక్తులు సాధించిన విజయానికి ఇది ప్రతీకని పేర్కొన్నారు. రావణాసురుడిపై రాముడి విజయం, పాండవులు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తిరిగి తీయడం, మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించిన సందర్భాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. అమ్మవారి పూజ అనంతరం పోలీస్ వాహనాలకు, ఆయుధాలకు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!