దుర్గి, అక్టోబర్ 16
దుర్గి మండల కేంద్రంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై పోలీసులు దాడి చేసి గొంది వెంకయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ బి. గోపాల్ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 8 క్వార్టర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మద్యం అక్రమ విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణపై నిఘా ముమ్మరం చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ ఈ సందర్భంగా హెచ్చరించారు.
Be the first to share your thoughts on this story!