వెల్దుర్తి.
సెప్టెంబర్ 05
గత 26 సంవత్సరాలుగా జీవశాస్త్ర ఉపాధ్యాయినిగా అంకితభావంతో సేవలందిస్తున్న జడ్పీ హెచ్ ఎస్ (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల) వెల్దుర్తి పాఠశాల ఉపాధ్యాయిని మాడెబోయిన విజయ పద్మ కి పల్నాడు జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మక జిల్లా ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును ప్రధానం చేసింది. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట లో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ విప్ మరియు వినుకొండ ఎమ్మెల్యే జీ.వి. ఆంజనేయులు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులకు జీవశాస్త్రాన్ని సులభంగా అర్థమయ్యేలా బోధించడంలో ఆమె చేస్తున్న విశిష్ట కృషిని ఈ సందర్భంగా అతిథులు ప్రత్యేకంగా కొనియాడారు.
అవార్డు లభించడం పట్ల విజయ పద్మ హర్షం వ్యక్తం చేస్తూ తనకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్దుర్తి ప్రధానోపాధ్యాయులు కొమ్ము కిషోర్ కి, తోటి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమార్తెకు ఈ ఘనత లభించడం పట్ల ఆమె తల్లిదండ్రులు మాడెబోయిన గోపయ్య, వరలక్ష్మి, కుటుంబ సభ్యులు మరియు వెల్దుర్తి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Be the first to share your thoughts on this story!