Tuesday, 20 October 2026
Header1
BREAKING

ముత్యాలమ్మ సాక్షిగా ఊరుకునే ప్రసక్తే లేదు..!

- గ్రామోత్సవాల్లో అలజడులకు శిక్షలు తప్పవు..!, - ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 10 Sep 2026, 06:14 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 219 views

మాచర్ల  సెప్టెంబర్ 10 రాజధాని వాయిస్:

గ్రామాభివృద్ధి.., ప్రజా ఉన్నతికి నిర్వహించే ఉత్సవాల్లో నీచ రాజకీయాలతో అలజడులు సృష్టించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని జమ్మలమడల గ్రామంలో కొలువుదీరిన గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతరలో పాల్గొన్న జూలకంటి, ముందుగా గర్బాలయంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

WhatsApp Image 2026-09-10 at 5.59.14 PM.jpeg

అనంతరం జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన శిడిమాను ఉత్సవంలో పాల్గొని, ప్రత్యేక పూజలతో మాను గ్రామోత్సవాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖ అనేక ఆంక్షలు నడుమ తిరునాళ్లకు అనుమతులు వచ్చాయని, రాజకీయ పబ్బం కోసం పండుగ వాతావరణాన్ని పాడు చెయ్యెద్దని సూచించారు. పోలీసులకు సహకరిస్తూ.., ప్రశాంత వాతావరణంలో తిరునాళ్లను జరుపుకోవాలని సూచించారు. గ్రామానికి అపఖ్యాతి తెచ్చేలా ఎవరు ప్రవర్తించిన సహించేది లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X