మంత్రి నారా లోకేష్
అమరావతి.సెప్టెంబర్ 05
భారతరత్న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ (గురుపూజోత్సవం) శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వేపల్లి వంటి మహోపాధ్యాయుడి జయంతిని ప్రతి ఏటా గురుపూజోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ తల్లి, తండ్రి తర్వాత అత్యంత ఉన్నతమైన స్థానం ఉపాధ్యాయులదేనని, ప్రతి వ్యక్తి సాధించే విజయాల వెనుక గురువుల కృషి, మార్గదర్శకత్వం ఎంతో కీలకమని కొనియాడారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను మనస్ఫూర్తిగా గౌరవించుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి, విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ, విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆకాంక్షించారు.
Be the first to share your thoughts on this story!