వెల్దుర్తి ఆగష్టు ౩౦ రాజధాని వాయిస్ :
కూటమి ప్రభుత్వం నేతృత్వంలో తిరుమల తిరుపతి దేవస్ధానం వారి శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన రూ. 40 లక్షల నిధులతో మండల పరిధిలో బొదిలవీడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం అభివృద్ధికి అడుగులు పడ్డాయి. ఆదివారం ఆలయ ప్రాంగణంలో చేపనున్న పలు అభివృద్ధి పనులకు మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్ధాపన చేశారు. గర్బాలయాని ఇరువైపు ఏర్పాటు చేసిన ముఖ శిలాతోరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతనను సంస్ధాపన చేయడం ద్వారానే శాంతి నెలకొంటుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజబోయిన మధు యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు కళ్లం రామాంజిరెడ్డి, కుర్రి శివారెడ్డి, మందలపు రామకృష్ణ, సాధనాల వెంకయ్య, ధర్మవరపు శ్రీనివాసరావు, గుండు కృష్ణమూర్తి, అడుసుమల్లి వీరయ్య,పుట్టా వెంకటేశ్వర్లు, బాణావత్ వెంకటేశ్వర్లు, పెద బాలు, కొండా నాయక్, చిన బాలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments