కారంపూడి. ఆగస్టు 30
రాజదాని వాయిస్ :
మండల కేంద్రమైన కారంపూడి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం లో కారంపూడి మండల ఆర్యవైశ్య సంఘం మీటింగ్ ఏర్పాటు చేసి నూతన అధ్యక్షుని ఎన్నిక నిర్వహించడం జరిగింది. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చందోల ప్రకాష్ రావు పిలుపుమేరకు నూతన అధ్యక్షునిగా ఇమ్మడిశెట్టి సాంబశివరావు ను ఆతుకూరు గోపి ప్రతిపాదించగా పోలూరి శ్రీనివాసరావు బలపరిచారు.అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారిగా జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి జూలకంటి సురేష్ కుమార్ ఎన్నికల పరిశీలకునుగా స్టేట్ ఆర్యవైశ్య సంఘం నాయకులు భవిరి శెట్టి రామారావు మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఎస్ పి ఆర్ కృష్ణ, అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు మద్దు హనుమంతరావు, యువజన సంఘం అధ్యక్షులు సముద్రాల పవన్ సాయి, జాగృతి క్లబ్ అధ్యక్షులు కరాలపాటి ఆదినారాయణ, పిడుగురాళ్ల ఆర్యవైశ్య సంఘ నాయకులు కొనకండ్ల జ్ఞానేశ్వర్ రావ్, కనమర్లపూడి రామకృష్ణ, యక్కల మల్లికార్జునరావు, కారంపూడి మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు, పట్టణ ఆర్యవైశ్య సంఘం యువజన సంఘం సభ్యులు జాగృతి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments