విజయవాడ. ఆగస్టు 30
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం 23వ డివిజన్‌లో 100 శాతం విజయవంతంగా పూర్తయింది.
ఆదివారం ఉదయం 23వ డివిజన్ పార్టీ కార్యాలయంలో, కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ యువ నాయకులు బొండా రవితేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్లస్టర్ నంబర్-9 పరిధిలోని 23వ డివిజన్‌లో కార్యక్రమాన్ని పూర్తి చేసిన బూత్ ఏజెంట్లు, BLAలను ఆయన ప్రత్యేకంగా అభినందించి, ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు, వారి సమస్యలను తెలుసుకోవడంలో క్షేత్రస్థాయి శ్రేణులు చూపిన నిబద్ధత ఎంతో గొప్పదన్నారు. పార్టీకి వెన్నెముకగా నిలిచిన బూత్ ఏజెంట్లు, BLAల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. రాబోయే రోజుల్లోనూ ఇదే ఉత్సాహంతో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు, బూత్ ఇన్‌చార్జిలు, బిఎల్ ఏ లు, బూత్ ఏజెంట్లు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments