మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1100
జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్
బాపట్ల,ఆగస్టు 30 : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ హల్ నందు ఉదయం 9 గంటల నుండి 10 గంటలవరకు గతం లో పి జి ఆర్ ఎస్ కు వచ్చిన అర్జీల పరిష్కరం పై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని, అనంతరం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్ప కుండా హాజరు కావాలన్నారు.
అర్జీదారులు అందజేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు అర్జీదారులు కాల్ చేసి వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
0 Comments