మాచర్ల ఆగష్టు ౩౦ రాజధాని వాయిస్:
మండల పరిధిలోని ద్వారకాపురి గ్రామంలో శ్రీ కోదండ రామాలయ జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠమహోత్సవం ఆదివారం కన్నుల పండువగా సాగింది. ఈ ఉత్సవంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. గ్రామస్తుల సాదర స్వాగతం నడుమ ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై శ్రీరాం అంటూ నినాదాలు ప్రతిధ్వనిస్తుండగా గర్జాలయంలో కొలువుదీరిన స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజబోయిన మధు యాదవ్, వైస్ చైర్మన్ గుండాల శ్రీనియాదవ్, పార్టీ మండల అధ్యక్షులు వీరాస్వామి, గట్ల కోటిరెడ్డి, అన్నపురెడ్డి వెంకటరెడ్డి, గట్ల సత్యానారాయణ రెడ్డి, గన్నెబోయిన ప్రశాంత్ తదతరులు పాల్గొన్నారు.
0 Comments