మాచర్ల టౌన్ ఆగష్టు ౩౦ రాజధాని వాయిస్:
వరుణ దేవుని కృపాకటాక్షాలు రైతాంగంపై మెండగా ప్రసరించాలని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆకాంక్షించారు. స్ధానిక జమ్మలమడక రోడ్డులోని శ్రీ రామప్ప ఆలయంలో కొలువుదీరిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ చింతల రామలింగేశ్వరస్వామి వారి దేవస్ధానంలో సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్, ఫెర్టిసైడ్ మాచర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వరుణయాగం, ఘట్టాభిషేక మహోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. స్వామివారి విశేషపూజలు నిర్వహించి, తీర్ధప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పోలా శ్రీనివాసరావు, కార్యదర్శిలు పులుసు లక్ష్మారెడ్డి, కొత్తా అమనాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మేడం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఉన్నం రామ చంద్రయ్య, గౌరవ అధ్యక్షులు పోలీ చిన సత్యనారాయణ, ఎస్. శివారెడ్డి, పోలిశెట్టి ఆంజనేయులు, కొత్తా శ్రీనివాసరావు, మారం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments