Tuesday, 20 October 2026
Header1
BREAKING

ఫిర్యాదుల సత్వర పరిష్కారమే పోలీసుల లక్ష్యం:

- పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 21 Sep 2026, 05:58 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 120 views

నరసరావుపేట.

​ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, వారికి మెరుగైన పోలీస్ సేవలు అందించడమే ప్రధాన ధ్యేయమని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
​ఈ సందర్భంగా ఆర్థిక, కుటుంబ తగాదాలు, ఆక్రమణలు, బెదిరింపులు, వివిధ మోసాలకు సంబంధించి బాధితుల నుంచి మొత్తం 116 ఫిర్యాదులు అందాయి. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన అదనపు ఎస్పీ, సత్వర విచారణ నిమిత్తం ఆయా ప్రాంతాల పోలీస్ అధికారులకు రిఫర్ చేశారు. ప్రత్యేకించి మహిళలు, వృద్ధుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, క్షేత్రస్థాయి విచారణను వేగవంతం చేస్తూ చట్టప్రకారం బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, కార్యాలయానికి వచ్చిన నిరక్షరాస్యులైన అర్జీదారులకు ఫిర్యాదులు రాయడంలో పోలీస్ సిబ్బంది సహకారం అందించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X