Tuesday, 20 October 2026
Header1
BREAKING

ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డు అందుకున్న షేక్.ఫిరోజ్ బాషా

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 05 Sep 2026, 07:55 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 118 views

నరసరావుపేట.సెప్టెంబర్ 5,రాజధాని వాయిస్:

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 05-09-2026న శనివారం నరసరావుపేటలోని శ్రీ భువనచంద్ర టౌన్ హాల్ లో జరిగిన జిల్లా స్థాయి గురుపూజోత్సవంలో, పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు ఎం.పి.పి.ఎస్ (మెయిన్) పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్న షేక్ ఫిరోజ్ బాషా "జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ" పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ వేడుకలో పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పి.వి.జె.రామారావు, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, వినుకొండ శాసనసభ్యులు  జి.వి. ఆంజనేయులు చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును మరియు ప్రశంసాపత్రాన్ని స్వీకరించారు.
ఆటపాటలతో కూడిన వినూత్న బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా చేయడం, వారి తెలుగు మరియు ఇంగ్లీష్ చేతిరాతను ప్రత్యేకంగా తీర్చిదిద్దడం, అలాగే ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థుల నమోదును సాధించడంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా విద్యాశాఖ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ అవార్డు రావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు, ఎస్ఎంసి కమిటీ సభ్యులు, విద్యాశాఖ అధికారులు, యుటిఎఫ్ సంఘ నాయకులు, పల్నాడు జిల్లా మరియు పిడుగురాళ్ల మండలం ఉపాధ్యాయులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X