గుంటూరు.సెప్టెంబర్ 5,రాజధాని వాయిస్:
పిడుగురాళ్ల - రాజుపాలెంలో కెఎన్ఆర్ విద్యాసంస్థలలో రసాయన శాస్త్రఅధ్యాపకులుగా బోధిస్తున్నటువంటి సాదినేని నరసింహారావు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా అవార్డును వరించింది. ఈ అవార్డు సౌత్రన్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆర్గనైజేషన్ తెలియజేసినారు. రసాయన శాస్త్రంలో సరికొత్త మెలకువలతో విద్యను అందించినందుకు ఆవార్డును ప్రకటించినారు. గుంటూరులో భారతీయ విద్యా భవన్ జరిగే సభలోఅవార్డును రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ , మాజీ ఎమ్మెల్సీ కె.యస్. లక్ష్మణరావు చేతుల మీదగా అందుకున్నారు.ఈ సందర్భంగా
కె. యన్. ఆర్ విద్యాసంస్థల డైరెక్టర్స్ కోనేటి నరసింహారావు బాడిశ మస్తాన్ రావు అధ్యాపకులు టి. గోపికృష్ణ,సిహెచ్ శ్రీనివాస రావు, డి.సురేష్, జె. వీరాంజనేయులు, కోనేటి ప్రసన్న, బి.యాకోబు, బి. ఇందు, వి.రాజ, ఆలూరి ప్రసన్నకుమార్ అభినందించినారు.
Be the first to share your thoughts on this story!