గ్రామ సేవకుడు సాధుల్లా హుస్సేన్
ఆపద్బాంధవుడు ప్రజా సేవకుడు
రాజుపాలెం.నవంబర్ 27, రాజధాని వాయిస్:
పుట్టిన గడ్డ పల్లె సీమ రెడ్డిగూడెం గ్రామం రుణం తీర్చుకోవాలని, గ్రామాభివృద్దే ద్యేయంగా జన్మభూమి రుణం తీర్చుకోవడానికి సొంత నిధులతో లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు చేసి,పల్నాడు జిల్లా,రాజుపాలెం మండలం,రెడ్డిగూడెం ప్రజల హృదయాలను గెలిచి, గ్రామ అభివృద్ధిని కలగా కాదు కార్య రూపంలో చూపించిన సేవా దీక్షపరుడు సదుల్లా హుస్సేన్. మాటిచ్చాం చేసి చూపించాం, అభివృద్ధి అంటే ఇలా ఉండాలి అని ప్రజలకు అభివృద్ధిని చేతలతో చూపించి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి, సత్తెనపల్లి శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, పల్నాడు జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు దరువూరి నాగేశ్వరరావు, కూటమి నాయకులు, ప్రజల మద్దతుతో మరోసారి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నవంబర్ 29న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఉంగరం గుర్తుపై పోటీ చేయుచున్నారు.గ్రామ ప్రజలు అఖండ మెజార్టీతో మరోమారు గెలిపిస్తే గ్రామ రూపురేఖలు పూర్తిగా మార్చి వేస్తానని, నూతన సీసీ రోడ్ల ఏర్పాటు, మూడు ఎకరాలలో ఈద రక్షణ ప్రహరి గోడ, తాగునీటిని కోసం చేతి పంపులు ఏర్పాటు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయుట, కల్వర్టులు నిర్మించుట,గ్రామం నూరు శాతం అక్షరాస్యత సాధించుట, పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యకరమైన గ్రామాన్ని నిర్మించుట,యువకులను ప్రోత్సహించుటకు ఆటల పోటీలు నిర్వహించుట, షాదీ ఖానా, డిజిటల్ లైబ్రరీ, దేవాలయాలు, మసీదులు, చర్చిలు,ఖబరస్తాలు అభివృద్ధి చేసి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మాతృభూమిపై ఉన్న ప్రేమతో ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, కష్టాల్లో ఉన్న వ్యక్తులకు ఆర్థిక భరోసా కల్పించిన ఆపద్బాంధవుడు సాధుల్లా హుస్సేన్. కుల మతాలకు అతీతంగా సహాయ సహకారుల అందించిన అందరివాడు, అభివృద్ధి బాంధవుడు సాదుల్లా హుస్సేన్. ప్రభుత్వ సహాయ సహకారాలు ఒకవైపు, సొంత నిధులతో మరోవైపు గ్రామాన్ని అభివృద్ధి చేసి ఇంకా అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులను పూర్తి చేయటానికి సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల దీవెనలతో ముందుకు వస్తున్నారు సేవా తత్పురుషుడు సాదుల్ల హుస్సేన్. ప్రజల యొక్క అమూల్యమైన ఓటును రెడ్డిగూడెం గ్రామపంచాయతీ ఎన్నికలలో వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Be the first to share your thoughts on this story!