Friday, 27 November 2026
Header1
BREAKING

తుపాను నిరోధక విద్యుత్ వ్యవస్థకు కేంద్ర సాయం కోరిన మంత్రి గొట్టిపాటి

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 27 Nov 2026, 08:34 PM
👁️ 6 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

రూ.4,851 కోట్లతో తీర ప్రాంతాల్లో విద్యుత్ నెట్‌వర్క్ పటిష్ఠీకరణ 90 శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలని మనోహర్‌లాల్ ఖట్టర్‌కు విజ్ఞప్తి మూడేళ్లలో పనులు పూర్తి చేసేలా రాష్ట్ర కార్యాచరణ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):
దిల్లీ.
నవంబర్ 27

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో తుపానులను సమర్థంగా ఎదుర్కొనేలా విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. దిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఇటీవల రాష్ట్రంలో వరుసగా భీభత్సం సృష్టించిన అర్నబ్, మురసు తుపాన్ల కారణంగా విద్యుత్ వ్యవస్థకు జరిగిన భారీ నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. తుపాన్ల సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు దెబ్బతినడం వల్ల లక్షలాది విద్యుత్ కనెక్షన్లకు సరఫరా నిలిచిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు తీర ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన పటిష్ఠమైన విద్యుత్ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాల్లో భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేయడంతోపాటు, విద్యుత్ లైన్లను స్పన్‌పోల్స్‌తో పునర్నిర్మించేందుకు రూ.4,851 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపి 90 శాతం నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. మిగిలిన 10 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందితే 2027-28 నుంచి 2029-30 వరకు మూడేళ్లలో ప్రతిపాదిత పనులన్నీ పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. భూగర్భ కేబుళ్లు, స్పన్‌పోల్స్‌తో విద్యుత్ పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేస్తే తుపానుల సమయంలో ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, సాంకేతిక నష్టాలను తగ్గించడంతోపాటు, విపత్తుల అనంతరం విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని వివరించారు.
తుపాన్ల సమయంలో ప్రతిసారీ దెబ్బతిన్న వ్యవస్థను పునరుద్ధరించడానికి భారీగా నిధులు ఖర్చు చేయడం కంటే, ముందుగానే విపత్తులను తట్టుకునేలా మౌలిక వసతులను నిర్మించడం మేలని మంత్రి గొట్టిపాటి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రతిపాదనపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఏపీ ట్రాన్స్ కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ పాల్గొన్నారు. 
విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి తెలంగాణ నుంచి హాజరైన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమావేశం అయ్యారు. అర్నబ్, మురసు తుపానుల సమయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి అందించిన సాయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో గొట్టిపాటి గుర్తు చేసుకున్నారు. అత్యంత క్లిష్ట సమయంలో తెలంగాణ అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1