*గుంటూరు, నవంబర్ 27:* రాజధాని వాయిస్:
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎండీ రేడియో డయాగ్నోసిస్ పీజీ పరీక్షల్లో గుంటూరు నగరం, గోరంట్ల గ్రామానికి చెందిన డాక్టర్ జల్లేపల్లి శివసాయి విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం సాధించారు. శ్రీకాకుళంలోని గ్రేట్ ఈస్ట్రన్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్‌లో ఎండీ రేడియో డయాగ్నోసిస్ విద్యను అభ్యసించిన శివసాయి, విశ్వవిద్యాలయ పరీక్షల్లో 608 మార్కులు సాధించి మూడో స్థానంలో నిలిచారు. వైద్య విద్యలో శివసాయి సాధించిన ఈ ఘనత పట్ల కళాశాల అధ్యాపక బృందంతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తన విజయానికి మార్గదర్శకత్వం వహించిన రేడియో డయాగ్నోసిస్ విభాగాధిపతి డాక్టర్ రూపేష్ మాండవతో పాటు అధ్యాపక బృందానికి శివసాయి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జల్లేపల్లి రవి, నాగకుమారి ల కుమారుడైన డాక్టర్ శివసాయి వైద్య విద్యలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటడం తమకు ఎంతో గర్వకారణమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శివసాయిని అభినందించి, వైద్యరంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Be the first to share your thoughts on this story!