Friday, 27 November 2026
Header1
BREAKING

ఆధ్యాత్మిక చింతనతో ఉత్సవాలు జరిపించాలి..!

ఎమ్మెల్యే జూలకంటి

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 26 Nov 2026, 06:16 PM
🔄 నవీకరణ: 27 Nov 2026, 09:56 AM
👁️ 15 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

.
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):
 వెల్దుర్తి  నవంబర్ 26 రాజధాని వాయిస్ 

రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక చింతనతో తిరునాళ్ల ఉత్సవాలు జరిపించాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి సూచించారు. దుర్గి మండలం, ధర్మవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి వారి 36వ వార్షిక మహోత్సవాలను 
పురష్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులు గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేసి, ఎమ్మెల్యేను ఆహ్వానించారు. అనంతరం ఉత్సవాలకు సంబంధించి ఈ నెల 26,27,28,29,30 తేదీల్లో జరగనున్న పలు కార్యక్రమాలను వివరించే గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో భక్తిశ్రద్దలతో నిర్వహించే తిరునాళ్ల మహోత్సవంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని సూచించారు. ఎమ్మెల్యేను కలసిన వారిలో జనసేన నాయకులు పులి హరి, ఆలయ ధర్మకర్త చవిడిశెట్టి కిష్టయ్య, గుండాల వెంకటేశ్వర్లు, ఆకుల రామలక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1