Friday, 27 November 2026
Header1
BREAKING

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన తరుణం ఇది..

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 26 Nov 2026, 11:36 PM
🔄 నవీకరణ: 27 Nov 2026, 10:00 AM
👁️ 9 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):

భారత రాజ్యాంగానికి 77 ఏళ్లు పూర్తి

విద్యాసంస్థల్లో రాజ్యాంగ ప్రవేశికను చదివించాలి

మాల ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి అక్కయ్య

మాచర్ల.నవంబర్ 26

 భారత రాజ్యాంగం ఆమోదం పొంది నేటికి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రతి పౌరుడు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని మాల ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి అక్కయ్య పిలుపునిచ్చారు. 77వ భారత రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) పురస్కరించుకుని గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
1949 నవంబర్ 26న డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన ఈ మహాగ్రంథం వల్లే నేడు అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు, సమాన హక్కులు, మానవ గౌరవం దక్కాయని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం లేకపోతే మాలలతో సహా దళిత వర్గాలకు నేడున్న ఈ స్థాయి ఉండేది కాదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వం), ఆర్టికల్ 15 (వివక్షత నిర్మూలన), ఆర్టికల్ 17 (అంటరానితనం నిషేధం) తమ జీవన భద్రతకు పునాదులని గుర్తు చేశారు.
రాష్ట్రంలోని ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థులతో రాజ్యాంగ ప్రవేశికను చదివించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బుట్టి అక్కయ్య కోరారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించకుండా అన్ని ఉపకులాలకు సమన్యాయం జరిగేలా చూడాలని, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేటి యువత రాజ్యాంగ విలువలపై, అంబేద్కర్ ఆశయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రాజ్యాంగాన్ని కేవలం ఒక పుస్తకంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ జీవిత విధానంగా భావించాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే దేశాన్ని కాపాడుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1