చిలకలూరిపేట.
నవంబర్ 26
పట్టణంలోని సంజీవనగర్‌కు చెందిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొచ్చర్ల కిషోర్ మాతృమూర్తి, మాజీ కౌన్సిలర్ కొచ్చర్ల విజయలక్ష్మి మృతి పట్ల మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విజయలక్ష్మి మరణవార్త తెలుసుకున్న విడదల రజిని గురువారం సంజీవనగర్‌లోని వారి నివాసానికి చేరుకున్నారు. విజయలక్ష్మి పార్థివ దేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుమారుడు కొచ్చర్ల కిషోర్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. విజయలక్ష్మి మృతి వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!