మాచర్ల సెప్టంబర్ 07 రాజధాని వాయిస్ :
మాచర్ల పురపాలక సంఘంలో ఎస్.ఐ.ఆర్ ప్రత్యేక ఓటరు జాబితా పునర్విమర్శపై బీ.ఎల్.ఓ లతో సమీక్ష సమావేశం
మాచర్ల పురపాలక సంఘ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమానికి సంబంధించి బూత్ లెవల్ అధికారులతో (BLOs) సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా AERO & మున్సిపల్ కమిషనర్ డి. వేణు బాబు మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా మొత్తం 9,140 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు 6,010 మంది తమ వివరాలను ధృవీకరించుకున్నట్లు తెలిపారు. ఇంకా 3,332 మంది తమ సంబంధిత పత్రాలతో మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో తమకు కేటాయించిన బీఎల్‌ఓను సంప్రదించి ఓటరు వివరాల పునరుద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
సమయానికి అవసరమైన ధృవీకరణ పత్రాలు సమర్పించని పక్షంలో, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటరు పేరు జాబితా నుండి తొలగించబడే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ప్రతి అర్హ ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరారు.
ఈ సమీక్ష సమావేశంలో ఇన్‌చార్జ్ AERO డి.ఈ. రాములు నాయక్, ఏఈ రాఘవేంద్రరావు, టీపీఓ నాగేశ్వరరావు మరియు బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!