మాచర్ల, సెప్టెంబర్ 13:
మాచర్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 13 మద్యం దుకాణాలకు మరో ఏడాది పాటు లైసెన్స్ రెన్యువల్ చేసుకుని నిర్వహించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. వీటిలో 10 జనరల్, 3 రిజర్వుడు కేటగిరీ దుకాణాలు ఉన్నాయి. ఈ మేరకు నరసరావుపేట జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కె. మణికంఠ గెజిట్ ప్రకటన జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలనుకునే ప్రస్తుత లైసెన్స్‌దారులు ప్రస్తుతం చెల్లిస్తున్న లైసెన్స్ ఫీజుపై 38 శాతం రెన్యువల్ ఫీజుతో పాటు పర్మిట్ రూమ్ పన్ను, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. సంబంధిత లైసెన్స్‌దారులు 2026 సెప్టెంబర్ 21 సాయంత్రం 5 గంటల్లోపు రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
గడువులోగా రెన్యువల్ చేసుకోని మద్యం దుకాణాలకు సెప్టెంబర్ 22న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి, అనంతరం లాటరీ విధానంలో కొత్త దరఖాస్తుదారులను ఎంపిక చేయనున్నట్లు మాచర్ల ఎక్సైజ్ సీఐ ఎన్. వెంకటరమణ మీడియాకు తెలిపారు. లాటరీ ప్రక్రియలో పాల్గొనేందుకు ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ దరఖాస్తు రుసుము ఉంటుందని ఆయన వెల్లడించారు.
Be the first to share your thoughts on this story!