మాచర్ల సెప్టెంబర్ 16 రాజధాని వాయిస్ :
MRPS జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17న గుంటూరు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MRPS సీనియర్ నాయకులు మాచర్ల రూబేను మాదిగ, పిలుపునిచ్చారు, గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం , పొన్నెకల్లు గ్రామంలో ఈనెల 1న పోలీసుల లాకప్ డెత్ కు గురై గుంటూరు GGH లో చికిత్స పొందుతూ మరణించిన ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన చీకటి గోపి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి చంపపెట్టుగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MRPS సీనియర్ నాయకులు మాచర్ల రూబేను మాదిగ పేర్కొన్నారు,
ఈ సందర్భంగా మాచర్ల రూబేన్ మాదిగ, మాట్లాడుతూ మరి కొన్ని గ్రామాలలో ఇప్పటికీ అంటరానితనం కుల వివక్ష. దళితులంటే చిన్నచూపు, పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు,
చీకటి గోపి లాకప్ డెత్‌పై IPS స్థాయి అధికారితో SIT విచారణ జరపాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, చీకటి గోపి మృతికి బాధ్యులైన పోలీసులపై హత్య, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, గోపి మృతికి బాధ్యులైన తాడికొండ సీఐ, ఎస్ఐతో సహా పోలీసు సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని, సీఐపై ఆరోపణలు ఉన్నప్పుడు అదే స్థాయి అధికారి విచారణ ఎలా చేస్తారు ? అని మందకృష్ణ మాదిగ సూటిగా ప్రశ్నించారు, సాయికృష్ణ లాకప్ డెత్ తరహాలో గోపి కేసులోనూ IPS అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి సిట్ విచారణ చేసే వరకు పోరాటం చేస్తాం అన్నారు, గోపి కుటుంబాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలిపించుకుని మాట్లాడాలని సూచించారు, గోపి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి, న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని MRPS జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హెచ్చరించారు,
ప్రభుత్వం వివక్షతో కూడిన నిర్ణయాలు తీసుకోవద్దు దళిత యువకుడు లాకప్ డెత్ ఆరోపణలపై చనిపోతే ప్రతిపక్ష నేత ఎందుకు పరామర్శించలేదు అని సూటిగా ప్రశ్నించారు.?
Be the first to share your thoughts on this story!