వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టదైవమైన గణనాథుడు ప్రజల జీవితాల్లోని సమస్త విఘ్నాలను తొలగించి, విజయాలను ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. ఎల్నినో ప్రభావంపై ఉన్న ఆందోళనలను పటాపంచలు చేస్తూ రాష్ట్రానికి విఘ్నేశ్వరుడు సమృద్ధిగా వర్షాలను తీసుకొచ్చారని పేర్కొన్నారు. పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. భక్తులందరూ ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలను జరుపుకోవాలని పిలుపునిస్తూ ‘జై బోలో గణేష్ మహరాజ్ కీ జై’ అని ఆయన పేర్కొన్నారు.
Tuesday, 20 October 2026
rajadhanivoice.in
ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు సిద్ధించాలి: మంత్రి నారా లోకేశ్
రాజధాని వాయిస్ :
Be the first to share your thoughts on this story!