*కృష్ణ వేణి డిగ్రీ కాలేజ్ లో యువతకు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నతెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ
రాజధాని వాయిస్ :
సత్తెనపల్లి పట్టణంలోని కృష్ణ వేణి డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించిన "యువతకు భరోసా" కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ - యువతే దేశ భవిష్యత్తు అని, రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి మెగా డీఎస్సీ, స్కిల్ డెవలప్మెంట్, పరిశ్రమల తీసుకొస్తున్నామని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ తో రాష్ట్రంలో ఐటీ, పరిశ్రమలు వస్తున్నాయని, సత్తెనపల్లి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు.
యువతలో ఉన్న సందేహాలను తెలుసుకొని, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి వివరించడం జరిగింది. మీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
ఈ కార్యక్రమం లో కాలేజ్ యాజమాన్యం కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!