Tuesday, 20 October 2026
Header1
BREAKING

విరాట్ విశ్వకర్మ భగవానుడికి మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు..

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 17 Sep 2026, 08:23 AM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 128 views
మంగళగిరి.

​ఉండవల్లిలోని తన నివాసంలో విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాల వేసి భక్తిశ్రద్ధలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజ నిర్మాణ శిల్పులైన కార్మికులకు, సకల చేతివృత్తుల నిపుణులకు ఆయన హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సృష్టి నిర్మాణానికి మూలపురుషుడైన విశ్వకర్మ భగవానుడు అసలైన నైపుణ్యానికి, అనితరసాధ్యమైన సృజనాత్మకతకు, శ్రమజీవుల నిరంతర కష్టపడే తత్వానికి సజీవ ప్రతీక అని మంత్రి కొనియాడారు. మానవ వికాసంలో, దేశ ప్రగతిలో శ్రమశక్తి పాత్ర వెలకట్టలేనిదని పేర్కొంటూ సమాజ శ్రేయస్సుకు పాటుపడే ప్రతి శ్రామికుడి శ్రమను మనం గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X