పెద్దకాల్వ.
చిత్తూరులో ఇటీవల మరణించిన టీడీపీ సీనియర్ నేత చెరుకూరి వసంత్ కుమార్ కుటుంబాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఆదివారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పెద్దకాల్వ గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లిన మంత్రి లోకేష్.. వసంత కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీకి వసంత్ కుమార్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. వసంత కుమార్ మృతిపట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్, ఎమ్మెల్యేలు అమర్ నాథ్ రెడ్డి, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, మురళీమోహన్, గురజాల జగన్మోహన్, వీఎమ్ థామస్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, తుడా ఛైర్మన్ డా.డాలర్స్ దివాకర్ రెడ్డి ఉన్నారు.
Be the first to share your thoughts on this story!