Tuesday, 20 October 2026
Header1
BREAKING

వినాయకుడి ఆశీస్సులతో మాచర్ల ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

- కుటుంబ సమేతంగా పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ సీనియర్ నాయకులు యాగంటి మల్లికార్జున రావు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ: 15 Sep 2026, 07:22 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 5 views

మాచర్ల:

పట్టణంలోని పలు వార్డుల్లో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్న వేళ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీ యాగంటి మల్లికార్జున రావు కుటుంబ సమేతంగా పలు వినాయక మండపాలను సందర్శించి విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

WhatsApp Image 2026-09-15 at 6.41.41 PM (2).jpeg

ఈ సందర్భంగా యాగంటి మల్లికార్జున రావు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. మాచర్ల నియోజకవర్గ ప్రజలందరిపై విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఆనందం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

వినాయక ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలు మాత్రమే కాదని, ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చే ఐక్యత, సోదరభావానికి ప్రతీకలని యాగంటి పేర్కొన్నారు. మాచర్లలో భక్తి, సోదరభావం, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు.

WhatsApp Image 2026-09-15 at 6.41.41 PM (1).jpeg

పలు వినాయక మండపాల వద్ద స్థానికులు, యువత, ఉత్సవ కమిటీ సభ్యులతో యాగంటి మల్లికార్జున రావు ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజా కార్యక్రమాల్లో ముందుండే నాయకుడిగా ప్రజలతో మమేకమవుతూ యాగంటి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో శివ, యాగంటి ప్రతాప్, మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు, అల్లం వెంకటేశ్వర్ రెడ్డి, చెన్న, బొట్టు కోటేశ్వరరావు, కృష్ణ, స్వామి, కొండలు, వెంకటేష్, శ్రీను తదితరులతో పాటు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X