*సర్వీస్ రోడ్లు వేసి ప్రమాదాల బారీనుండి కాపాడండి మహా ప్రభో*
రాజుపాలెం.సెప్టెంబరు 12,రాజధాని వాయిస్:
కొండమోడు- పేరేచర్ల రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు విస్తరణ,ఎత్తు పెరగటం వల్ల రాజుపాలెం మండలం, కోట నెమలిపురి గ్రామముకు వెళ్లే రోడ్డు ఐదు నుండి ఆరడుగులు మెరకగా ఉండటం వల్ల గ్రామం నుండి వచ్చే వాహనాలు, వెళ్లే వాహనాలకు ఇబ్బంది అవుతుంది. గ్రామం నుండి ఒక లారీ మెరక దగ్గరగా వచ్చేసరికి ఎక్కలేక గేర్ బాక్స్ పగిలి సడన్గా ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుండి వస్తున్న ఆటోలో ప్రయాణికులు ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.నిత్యం ఇక్కడ క్వారీల నుండి వచ్చే ట్రాక్టర్లు లారీలు వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామానికి వెళ్లే రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి ప్రమాదాల బారి నుండి ప్రజలను కాపాడాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
Be the first to share your thoughts on this story!