• బాపూజీ ఆశయాల సాకారానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి
• సమానత్వం, గ్రామ స్వరాజ్యం, స్వచ్ఛత సాధనే అసలైన నివాళి
• జాతిపిత జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు
అమరావతి:
దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాల సాధన కోసం సర్వస్వం అంకితం చేసిన ధన్యజీవి జాతిపిత మహాత్మా గాంధీ అని రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విశిష్ట సేవలను స్మరిస్తూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బాపూజీ చూపిన శాంతి, సహనం, సత్య మార్గంలో ప్రతి ఒక్కరం ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గాంధీజీ కలలుగన్న సమానత్వం, గ్రామ స్వరాజ్యం, స్వావలంబన, స్వచ్ఛత అనే ఉన్నత ఆశయాలను నిజం చేయడమే మనం ఆ మహనీయునికి ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాకారానికి ప్రతి పౌరుడూ చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Be the first to share your thoughts on this story!