రాజుపాలెం మండల పరిషత్తు చివరి సమావేశం
రాజుపాలెం.సెప్టెంబర్ 23,రాజధాని వాయిస్:
మండల ప్రజా పరిషత్ అత్యవసర సమావేశం మండల పరిషత్తు అధ్యక్షురాలు తెలుకుట్ల రాజేశ్వరి చంద్రమౌళి అధ్యక్షతన నిర్వహించారు.2021సెప్టెంబర్ 23 న మండల పరిషత్తు సర్వ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.24 సెప్టెంబర్ 2026 ఎంపిటిసిల పదవి కాలం ముగిస్తున్నందున చివరి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల పరిషత్తు సభ్యులు మండల అధ్యక్షురాలికి ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఈఓ,డిప్యూటీ ఎంపీడీఓ లు,ఎంపిటిసిలు, మండల పరిషత్తు కార్యాలయ సిబ్బంది,సచివాలయ సెక్రటరీ లు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!