Tuesday, 20 October 2026
Header1
BREAKING

కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుంది... నియోజకవర్గ ఇన్చార్జి బూసా రామాంజనే యులు

- మృతిచెందిన జనసేన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం...

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 15 Sep 2026, 07:54 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 108 views

మాచర్ల సెప్టెంబర్ 15 రాజధాని వాయిస్ :

మాచర్ల మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త శీలం శ్రీను మృతిచెందిన నేపథ్యంలో, ఆయన కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది.
WhatsApp Image 2026-09-15 at 5.23.57 PM.jpeg

ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్త బుసా రామాంజనేయులు శీలం శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా బుసా రామాంజనేయులు మాట్లాడుతూ, శీలం శ్రీను పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన క్రియాశీల కార్యకర్త అని, ఆయన మృతి పార్టీకి మరియు కార్యకర్తలకు తీరని లోటని అన్నారు. శ్రీను కుటుంబానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ స్పందించి పార్టీ కార్యకర్త చనిపోతే 5 లక్షల రూపాయల చెక్కును పంపించారు.
కష్టకాలంలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా కార్యకర్తల కుటుంబాల పట్ల పార్టీకి ఉన్న బాధ్యతను చాటిచెప్పడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా శ్రీను కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హరి, మాచర్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుండెబోయిన సాంబశిరావు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానికులు పాల్గొని శీలం శ్రీను కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X