కారంపూడి, సెప్టెంబర్ 12:
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ క్లినిక్ ఉపయోగపడుతుందని శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ డీఎంహెచ్ఓ రత్న మన్మోహన్, కారంపూడి పిహెచ్సి డాక్టర్ రమ్య, డాక్టర్ మౌనిక, హెల్త్ అసిస్టెంట్ లాలు నాయక్, సీహెచ్ఓ మస్తాన్ పాల్గొన్నారు.
అలాగే టీడీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, గ్రామస్థులు హాజరయ్యారు.
విలేజ్ హెల్త్ క్లినిక్ అందుబాటులోకి రావడంతో కారంపూడి పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని అధికారులు తెలిపారు.
Be the first to share your thoughts on this story!