రాజధాని వాయిస్ :
మార్కాపురం జిల్లాలో నిర్వహించిన వెలిగొండ ప్రాజెక్టుప్రారంభోత్సవం కార్యక్రమంలో పల్నాడు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు మరియు గిరిజన గురుకుల పాఠశాలలకు చెందిన 284 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులు సంప్రదాయ సుగాలి నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించి కార్యక్రమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, గిరిజన సంస్కృతి, సంప్రదాయ కళలు మరియు వారసత్వాన్ని ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన చేశారు.విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనను ముఖ్యమంత్రి , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థుల ప్రదర్శనను అభినందిస్తూ వారిని ప్రోత్సహించారు.
పల్నాడు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో గిరిజన విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం పట్ల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి బి. గోవింద్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు.
గిరిజన విద్యార్థుల్లో విద్యతో పాటు సాంస్కృతిక ప్రతిభను, సంప్రదాయ కళలను ప్రోత్సహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ నిరంతరం కృషి చేస్తోందని నాయక్ గారు తెలిపారు.
0 Comments